SRPT: ఈనెల 30న సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్‌కు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం సభా ఏర్పాట్లను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగనాడు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి సీఎం వస్తున్నారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.