NLG: మునుగోడు నుంచి నార్కట్పల్లికి వెళ్తున్న బొలెరో వాహనం నిన్న రాత్రి వడ్డెరగూడెం దగ్గరమూల మలుపు వద్ద అదుపుతప్పి బావిలో పడింది. బావిలో నీరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి పోలీసులు తరలించారు. బావిలో పడ్డ వారు కట్టంగూరు మండలం దుగినెల్లికి చెందిన జాడిగల రాజు కుటుంబంగా గుర్తించారు.