BDK: భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలంలో రూ. 8.26 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న పలు బీటీ రోడ్ల పనులకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు.