VKB: భారత్ గ్యాస్ వినియోగదారులందరూ తప్పనిసరిగా e-KYC పూర్తి చేసుకోవాలని MPDO రామకృష్ణ తెలిపారు. కుల్కచర్లలో ఇంకా చాలా మందికి e-KYC పెండింగ్లో ఉందని అన్నారు. అక్టోబర్ 31లోగా ఆధార్ కార్డుతో భారత్ గ్యాస్ ఏజెన్సీకి వచ్చి లేదా BPCL యాప్ లింక్ ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చని సూచించారు. డెలివరీ బాయ్ ద్వారా కూడా ఈ సేవను పొందవచ్చని పేర్కొన్నారు.