GDWL: సంక్రాంతి వేడుకల సందర్భంగా నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని అయిజ ట్రైనీ ఎస్సై కిరణ్ కుమార్ హెచ్చరించారు. గద్వాల ఎస్పీ ఆదేశాలతో అయిజ పట్టణంలోని దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. చైనా మాంజా వల్ల పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు. ఈ తనిఖీల్లో పీసీలు ఆకాష్, రవి పాల్గొన్నారు.