NRML: ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం నిర్మల్ పట్టణంలో పురపాలక సంస్థ, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో 2K రన్ స్థానిక మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జెండా ఊపి ఈ రన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 1 నుండి 9 వరకు జిల్లాలో విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.