WGL: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం అధికారుల ప్రధాన బాధ్యత అని జిల్లా కలెక్టర్ సత్య శారద పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘పోష్’ యాక్ట్-2013పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కార్యాలయంలో చట్టాన్ని కచ్చితంగా అమలు చేసి, మహిళలకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు.