NLG: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కాగా 100 మందికి రూ. 36.94 లక్షలు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, వైస్ ఛైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.