MNCL: గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామ సర్పంచ్ యాదగిరి భారతి అన్నారు. ఇవాళ ఆ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పాలకమండలి మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పుష్పలత, కార్యదర్శి జంగు ఉన్నారు.