NRML: సిగ్రిగేషన్ పనులలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని దిలావర్పూర్ ఎంపీఓ గోవర్ధన్ అన్నారు.శుక్రవారం దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో వారు పర్యటించారు. గ్రామంలో నిర్వహిస్తున్న కుటుంబ సర్వేను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. సిగ్రిగేషన్ షెడ్ పరిశీలించి తడి పొడి చెత్త వేరువేరుగా చేసి సిగ్రిగేషన్ పనులు ఎప్పటికప్పుడు నిర్వర్తించారన్నారు.