కృష్ణా: అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నూజివీడులో చోటుచేసుకుంది. ముసునూరు మండలం చింతలపల్లి గ్రామ శివారు గోగులంపాడుకి చెందిన కౌలు రైతు చెన్ను రాజారావు(38) అప్పుల బాధతో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు నూజివీడు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.