కృష్ణా: గన్నవరంలోని విజయవాడ రోడ్డులో గల అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఖాళీ స్థలాలలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలకు చెందిన వారు, అక్కడే నివసిస్తున్న స్థానిక ప్రజలు.. నిల్వ ఉన్న వర్షపు నీటి వలన దోమలు, ఈగలతో బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.