జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలంటూ NC ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఉన్న కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. కశ్మీర్ ఇండియాలో భాగం కాదనేలా ఆర్టికల్ 370 ఉందని మండిపడ్డారు. ‘ఛత్రపతి శివాజీ పుట్టిన గడ్డ మీద నుంచి చెబుతున్నా.. మీ నాలుగు తరాలు వచ్చి అడిగినా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకొచ్చే ప్రసక్తే లేదు’ అని చెప్పారు.