TG: మావోయిస్టుల లేఖపై స్పీకర్ గడ్డం వినోద్ పరోక్షంగా స్పందించారు. తనది కబ్జాలు, వసూళ్లు చేసే సంస్కృతి కాదని తెలిపారు. కార్యకర్తలు ఎవరైనా కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రజలకు చిన్న కష్టం కూడా రానివ్వనని మాట ఇచ్చారు. ప్రజలను వేరే ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు తను అండగా ఉంటానని స్పష్టం చేశారు.