GDWL: విద్యార్థులు అవసరాలకే ఫోన్ వాడాలని అలంపూర్ సీఐ రవి బాబు అన్నారు. ఆలంపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేటే పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు బాల్య వివాహాలు, సైబర్ నేరములు, సెల్ ఫోన్ చిన్నతనంలో వాడడం వలన కలిగే నష్టాలను వివరించారు. చదువుకోలేకపోతే భవిష్యత్తులో కలిగే కష్టాలపై అవగాహన కల్పించారు.