AP: ఏలూరు పోలీసులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. చోరీకి గురైన స్కూటర్‌ను మహిళకు పోలీసులు అప్పగించడాన్ని అభినందించారు. నీల అలివేణి అనే మహిళ భావోద్వేగం చెందడం తనను కదిలించిందని తెలిపారు. స్కూటర్ ఆమెకు ఎంత ముఖ్యమో చూస్తే వారి పరిస్థితి అర్థమైందన్నారు. తలసేమియా బాధిత కుమార్తెను ఆమె స్కూటర్‌పైనే ఆస్పత్రికి తీసుకెళ్లేవారని.. పోలీసులు చేసిన పని సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.