మైదానంలో కెప్టెన్ షాయ్ హోప్‌తో వాగ్వాదానికి దిగిన విండీస్ ఆటగాడు అల్జారీ జోసెఫ్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. రెండు మ్యాచుల్లో ఆడకుండా నిషేధం విధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్‌తో ఫీల్డింగ్ సెటప్ విషయంలో జోసెఫ్ గొడవ పడి మ్యాచ్ మధ్యలోనే డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో అతడిపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు విండీస్ బోర్డు వెల్లడించింది.