మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమిలో సీఎం ఎవరనే అంశంపై అంతర్గత పోరు జరుగుతోందని విమర్శించారు. డ్రైవర్ సీటు కోసం మహా వికాస్ అగాడీ నేతలు కొట్టుకుంటున్నారని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మాత్రమే మహారాష్ట్రని అభివృద్ధి పథంలో నడిపించగలదని వ్యాఖ్యానించారు.