WGL: సహకార సంఘాల ఎన్నికల రద్దు రైతుల ఐక్యతను దెబ్బతీయడానికేనని ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వల్లందాస్ కుమార్ విమర్శించారు. వర్ధన్నపేటలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. నామినేట్ పోస్టుల విధానం ద్వారా రైతులను విభజిస్తున్నారని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు.