KMM: రఘునాథపాలెం మండలం మంచుకొండ PHCలో సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ రెగ్యులేషన్ పోస్ట్ ను భర్తీ చేయాలని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వి రాకేష్, పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్షులు గోకినపల్లి లలితలు డిమాండ్ చేశారు. సోమవారం ఆయా సంఘాల జిల్లా బృందం పిహెచ్సిలో సర్వే చేసి విద్యాధికారి బాలకృష్ణతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.