»Cm Kcrs Illness Family Members Shifted To Aig Hospital
CM KCR Illness : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
సీఎం కేసీఆర్ (CM KCR) అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో సీఎంకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు మరో గంటలో రిపోర్టు రానున్నట్లు తెలియవచ్చింది. అయితే జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సీఎం కేసీఆర్ (CM KCR) అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో సీఎంకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు మరో గంటలో రిపోర్టు రానున్నట్లు తెలియవచ్చింది. అయితే జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మెడికల్ చెకప్ కోసం కేసీఆర్ ఎప్పుడూ యశోద, నిమ్స్ ఆస్పత్రులకు మాత్రమే వెళ్తుంటారు. అయితే ఏఐజీకి ఎందుకొచ్చారు..? అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ కూడా అస్వస్థతకు (KCR Wife Hospitalized) గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురవ్వగా శోభాను గచ్చిబౌలిలోని AIG ఆస్పత్రికి తరలించారు. శోభా వెంట కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు.
ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తన తల్లిని చూడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్పత్రికి వెళ్లారు. అమ్మ ఆరోగ్యంపై డాక్టర్లను అడిగి కవిత వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి నేరుగా మీడియాతో మాట్లాడకుండానే బంజారాహిల్స్‌లోని తన నివాసానికి కవిత (MLC Kavitha) వెళ్లిపోయారు. అయితే.. శోభను ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత కేసీఆర్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు.. కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంతో ఏఐజీ ఆస్పత్రికి తరించారని కూడా రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ (KCR-Kavitha Meeting) అయ్యారు. ప్రగతి భవన్లో (Pragathi Bhavan) జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు (KTR, Harish Rao) కూడా పాల్గొన్నారు. 9 గంటలపాటు జరిగిన ఈడీ విచారణ గురించి కేసీఆర్‌కు కవిత నిశితంగా వివరించారు.
అనంతరం 16న మరోసారి విచారణకు వెళ్లడంపైన కూడా కేసీఆర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయనిపుణులు, బీఆర్ఎస్ లీగల్ సెల్ (BRS Legal cell) సభ్యులతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు ఈడీ విచారణలో ఎలావ్యవహరించాలనేదానిపై కవితకు కేసీఆర్ కొన్ని కీలక సలహాలు, సూచనలు చేసినట్లుగా సమాచారం. అయితే.. ఈ సమావేశం జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే శోభ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స తర్వాత సీఎం సతీమణి ఆరోగ్యం కుదుటపడింది. సాయంత్రం 4 గంటలకు శోభ, కేసీఆర్ ఇద్దరూ ఆస్పత్రి నుంచి ఇంటికెళ్తారని తెలియవచ్చింది. మంత్రులు కేటీఆర్, హరీష్(Ministers KTR, Harish) బోయిన్పల్లి వినోద్ కుమార్, ఎంపీ సంతోష్‌లు ఆస్పత్రిలోనే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.
చదవండి :లేటెస్ట్ పిక్స్ తో నెట్టింట సెగలు పుట్టిస్తోన్న హనీ రోజ్..