భారత దేశం(India)లో కొత్తగా 50 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తెలంగాణ(Telangana) లో 12, ఏపీలో 5 మెడికల్ కాలేజీలు (Medical Colleges) ఏర్పాటు కేంద్రం మంజురు చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుండి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ప్రారంభమవుతాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Central health dept) తెలిపింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు.తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మేడ్చల్, వరంగల్(Warangal),భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్ లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.మేడ్చల్- మల్కాజ్గిరిలో అరుందతి ట్రస్ట్, మేడ్చల్లో సిఎంఆర్ ట్రస్ట్, వరంగల్లో ఫాదర్ కొలంబో ట్రస్ట్, హైదరాబాద్లో నీలిమా ట్రస్ట్(Neelima Trust)ల ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానుండగా.. మిగిలిన అన్ని జిల్లాల్లోని కాలేజీలు ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది.