WGL: చెన్నారావుపేట మండలంలోని బోజెరు గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డల బిక్షపతి బుధవారం విజయం సాధించారు. ఆయన గెలుపుతో గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. గ్రామాభివృద్ధి, ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తానని బిక్షపతి తెలిపారు.