NZB: తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని LLB & LLM IV సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఫీజు తేదీలను వర్సిటీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, అదే విధంగా అపరాధ రుసుముతో సెప్టెంబర్ 1వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని కంట్రోలర్ ప్రొ.కే.సంపత్ కుమార్ తెలిపారు.