WGL: నల్లబెల్లి మండల కేంద్రం నుంచి శనిగరం మూలమలుపు వరకు రోడ్డు డివైడర్ అలంకారప్రాయంగా మారింది. డివైడర్ నిర్మాణం తర్వాత అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడంతో డివైడర్ చెత్తాచెదారంతో నిండి, పందులు, కుక్కలు తిరుగుతున్నాయి. డివైడర్‌లో పచ్చని మొక్కలు పెంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని స్థానికులు శుక్రవారం అధికారులను కోరారు.