ADB: ఉమ్మడి జిల్లా ఉట్నూరు పట్టణంలో గిరిజన యువతి యువకుల కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 28న ఉదయం 10 గంటలకు పట్టణంలోని కేబి కాంప్లెక్స్ వైటీసీ కేంద్రంలో ఉద్యోగ మేళా ఉంటుందన్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా మేళా నిర్వహిస్తున్నామన్నారు.