HYD: సైబరాబాద్ పోలీసులు వాహనదారులను బుధవారం ఉదయం అప్రమత్తం చేశారు. గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ వెళ్లే ప్రధాన రహదారిలో హెవీ వెహికల్ బ్రేక్ డౌన్ అయినట్లు తెలిపారు. ఈ కారణంగా వాహనాల కదలిక మందగించింది. ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని క్లియర్ చేస్తున్నారు. వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు.