PDPL: ధర్మారం మండలం కొత్తూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ భూక్య సంగీతను శాలువాతో సన్మానించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్ధాల సేకరణపై కార్యదర్శి మల్లేశం ద్వారా వివరాలు సేకరించారు. సక్రమంగా పారిశుద్ధ్యం పనులు నిర్వహించాలని కార్యదర్శికి సూచించారు.