ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. ఉమాదేవి గంజాయి రవాణా కేసులో కీలక తీర్పు ఇచ్చారు. 2013 అక్టోబర్ 27న ఆటోనగర్ ఆర్చి వద్ద 10 కేజీల గంజాయితో పట్టుబడిన ఖమ్మం నివాసి నారపొంగు కల్యాణ్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ నిన్న తీర్పు వెలువరించారు.