NZB: బోధన్ కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని 5వ అదనపు జిల్లా, మండల న్యాయ సేవ కమిటీ ఛైర్పర్సన్ వరూధిని మంగళవారం ప్రారంభించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఈ కేంద్రానికి పంపిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం కక్షిదారులకు కోర్టు వెలుపల, స్నేహపూర్వక వాతావరణంలో త్వరితగతిన సమస్యలను పరిష్కరించుకునే సదుపాయాన్ని కల్పించడమన్నారు.