HYD: జూబ్లీహిల్స్ బస్టాండ్ నుంచి శామీర్పేట్ వరకు ఫ్లెఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వంశీకృష్ణ కాలనీ వాసులతో ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన వెల్లడించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భూములను కేటాయించిందని తెలిపారు.