Bhatti Vikramarka : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేయడం పై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కవితకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ లిక్కర్ స్కాం నేపథ్యంలో... ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కూడా ఆయన మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేయడం పై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కవితకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్లు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ లిక్కర్ స్కాం నేపథ్యంలో… ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై కూడా ఆయన మండిపడ్డారు.
అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామని.. కేజ్రీవాల్ ఇండియా పరువు తీశాడని భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కాం కొన్ని ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది.. అవినీతిని చీపురుతో ఊడ్చేస్తామని, తాను గాంధేయవాదినంటూ కేజ్రీవాల్ గొప్పలు చెప్పారని మండిపడ్డారు. దేశంలో ఏ పార్టీ చేయనంత లిక్కర్ స్కాం ఆప్ ప్రభుత్వం చేసింది.. కేజ్రీవాల్ లిక్కర్ స్కాంలో పాల్గొనడం దురదృష్టకరం అన్నారు. లిక్కర్ స్కాంతో తెలంగాణ సెంటిమెంట్‌కు ఏం సంబంధం.. భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.
కవితకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా? అని ప్రశ్నించారు. విచారణను ఎదుర్కోవాల్సింది పోయి తెలంగాణకు అవమానం అంటున్నారన్నారని మండిపడ్డారు. కవిత మీద అభియోగాలు వచ్చాయి.. సమగ్ర విచారణ కి సిద్ధం అని చెప్పాలని డిమాండ్ చేశారు.