KNR: కరీంనగర్లో నిర్వహిస్తున్న 2024-2025 సంవత్సర జిల్లాస్థాయి 52వ రాష్ట్రీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం ముగిసింది. ముఖ్య అతిథిగా చొప్పదండి MLA మేడిపల్లి సత్యం హాజరై, వినూత్న అంశాలను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించి, విజేతలకు బహుమతులు అందజేశారు. టెక్నాలజీని వినియోగించుకుని విద్యార్థులు విజ్ఞానం పెంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.