PDPL: దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం డిసెంబర్ 3న మంగళవారం ఉదయం 11.35 గంటల నుంచి మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్నవారు రెన్యువల్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.