BDK: పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భద్రాచలం పట్టణంలోని శుక్రవారం భద్రాచలం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకం అన్నారు.