KMM: అంగన్వాడీ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్‌లను ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బోడా వెంకన్న అన్నారు. ఖమ్మం రూరల్ (మం) తీర్థాల అంగన్వాడీ కేంద్రం-1 పిల్లలకు సర్పంచ్ శైలజతో కలిసి కాంగ్రెస్ నాయకులు యూనిఫామ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు గంగా, లలితా, సూపర్వైజర్ పుష్పలత, శివాలయం ఛైర్మన్ రామోజీ పాల్గొన్నారు.