BDK: కూనవరం రోడ్లో ఎస్సై సతీష్ నిర్వహించిన వాహన తనిఖీల్లో 222.966 కేజీల గంజాయి లభ్యమైనట్టు ఎస్పీ రోహిత్ రాజు సోమవారం తెలిపారు. కూనవరం నుంచి భద్రాచలం వైపుగా వెళ్తున్న లారీని ఆపి తనిఖీలు చేయగా ప్రభుత్వ నిషేదిత 110 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1,11,48,300 ఉంటుందని చెప్పారు.