SRPT: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని చౌరస్తాలోని కాలియా హోటల్లో ఒక సామాన్య పౌరులుగా స్థానికులతో కలిసి ఆదివారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు చాయ్ తాగుతూ కాసేపు సరదాగా గడిపారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రజలంతా ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలతో స్థానికులు కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.