SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 4వ తేదీన జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ అధికారి ఖాసీంభేగ్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.