KMM: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన ఫీజులను ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇటికల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఫీజులను భారీగా పెంచి పేద విద్యార్థులపై భారం మోపడం సరికాదన్నారు.