NRML: ప్రజాపాలన ప్రజా విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. సోమవారం మిరుమిట్లు గొలిపే విధంగా ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించారు. ఈ నెల 9వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.