KMM: అదాని అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు నిర్వహించిన ధర్నాలో MHBD ఎంపీ పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం అదాని లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.