MLG: నూగూరు వెంకటాపురం గోదావరి సరిహద్దులో పులి సంచరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం ఓ రైతు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గోదావరి సమీప పొలాల వద్దకు చేరుకుని అడుగుజాడలను గుర్తించారు. కాగా పులి అడుగు జాడలను గుర్తించిన ఫారెస్ట్ అధికారులు గోదావరి నదిని దాటి పులి మంగపేట మండలం వైపు వెళ్లిందని తెలిపారు.