SRD: జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.