హైదరాబాద్ బోరబండ (Borabanda) లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు వేసిన చెత్త విషయంలో పక్క ఇంటి వాళ్లు ఘర్షణ పెట్టుకొని నిండు గర్భిణి (Pregnant) పై దాడి చేసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.బోరబండ ప్రాంతంలో ఓ ఇంటి ముందు కొందరు చెత్త వేశారు. దాంతో చెత్తను తమ ఇంటి ముందు ఎందుకు వేశావని ఓ గర్భిణిపై దాడి చేశారు. దాంతో ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దాంతో అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు పోలీస్ కానిస్టేబుల్ , స్దానికుల సహాయంతో తరలించారు.
దీనిపై విచారణ నిమిత్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో కొత్తగా మధురానగర్ , బోరబండ పోలీసు స్టేషన్లు ఏర్పడ్డాయి. ఈ ఘటన జరిగిన వెంటనే బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి మధురానగర్ (Maduranagar)పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీస్ లు తమ పరిధి కాదని, బోరబండ స్టేషన్కు వెళ్లమని చెప్పారు. దాంతో బాధితులు బోరబండ పోలీస్ స్టేషన్ (Police station) కి వెళ్లి ఫిర్యాదు ఇస్తుండగానే గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో వారు ఫిర్యాదు చేయకుండనే వెళ్లిపోయారు. కాగా బాధితులు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.