HYD: ఉమ్మడి RR, HYD జిల్లాలలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫై చేస్తున్నారు. అనేక చోట్ల గతంలో ఇందిరమ్మ ఇళ్లు వచ్చిన వారి నుంచి మళ్లీ దరఖాస్తులు రాగా, అధికారులు ఫోటో తీసుకుని పరిశీలిస్తున్నారు. గతంలో ఇళ్లు వచ్చిన వారికి మళ్లీ ఇస్తారా? అనే ప్రశ్న ప్రజల్లో మొదలైంది. దీనిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.