WNP: పది రోజులుగా యూరియా ఇవ్వకుండా అధికారులు వేధిస్తున్నారని అమరచింత మండలంలోని మిఠానందిమల్ల, కొంకన్వానిపల్లి గ్రామాలకు చెందిన మహిళ రైతులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. అమరచింత లో ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. అగ్రికల్చర్ అధికారులు రావాలంటూ రోడ్డుపైనే భోజనం చేసి నిరసన తెలిపారు. రైతులకు వామపక్ష పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.