KDP: జగన్ సీఎంగా ఉన్న సమయంలో పులివెందులకు చేసింది శూన్యమని టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పులివెందులలోని పాత బస్టాండ్ ఆవరణంలో నిర్మిస్తున్న సిటీ సెంట్రమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. పులివెందులలో సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదన్నారు.