ADB: ప్రభుత్వ విధానాలకు నిరసనగా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ ఉదయం 11 గంటలకు వినతి పత్రం అందజేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా చెప్పట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.