KMR: బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి, స్త్రీ నిధి రాష్ట్ర బోర్డులో కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ ఆమెను అభినందించి, రాష్ట్రస్థాయిలో రాణించాలని సూచిస్తూ శాలువాతో సత్కరించారు.